ఉండి కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవ వేడుకలు

 

ఉండి గ్రామం లో కృషి విజ్ఞాన కేంద్ర ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రజతోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమం 09.11.2020 వ తేదీన జరిగినది. ఈ కార్యక్రమానికి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు డా. జి. జోగినాయుడు గారు అధ్యక్షత వహించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము మరియు భారత వ్యవసాయ పరిశోధనా మండలి వారి సంయుక్త ఆధ్వర్యంలో 09.11.1995 సంవత్సరంలో ఉండి గ్రామం నందు కెవికె స్థాపించబదినదని తెలిపారు. మారుటేరు వరి పరిశోధనా స్థానం నుండి విడుదల చేయబడిన అధికదిగుబదినిచ్చే ఎం.టి.యు రకాలను రైతులకు చేరువచేయడం లో మిక్కిలి కృషి చేసినదని తెలిపారు. జిల్లాలో మొట్ట మొదటి సారి “శ్రీ” వరి సాగు విధానాన్ని ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం కల్పించడంలో కెవికె పాత్ర మరువలేనిదని తెలిపారు. దీనితో పాటుగా రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా రైతు స్థాయి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామ స్థాయి విత్తన కొరత తగ్గించడంలో ప్రాముఖ్యత వహించిందని కొనియాడారు.

 

 

 తదుపరి డా. పి. రమేష్ బాబు, ప్రధాన శాస్త్రవేత్త (వరి) వారు మాట్లాడుతూ ప్రస్తుతం కెవికె నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి తెలిపారు. కెవికె లో నిర్వహిస్తున్న వివిధ ప్రదర్శనా క్షేత్రాలను తప్పనిసరిగా అనదరూ వినియోగించుకోవాలని తెలిపారు.

        

డా. సి.వెంకట రెడ్డి గారు ప్రాధాన శాస్త్రవేత్త (పంటల యాజమాన్య విభాగం) వారు మాట్లాడుతూ కెవికె గత 25 సంవత్సరాలుగా క్షేత్ర పరిశీలనలు, ప్రధమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాల ద్వారా వివిధ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు.

     

కెవికె అధిపతి డా.ఎన్.మల్లిఖార్జున రావు గారు మాట్లాడుతూ ఈ రోజు రజతోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం రజతోత్సవ సంవత్సరం గా జరుపుకోవడానికి ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి – మార్చ్ నెలలలో కిసాన్ మేళా నిర్వహించి రైతులనందరినీ సత్కరిస్తామని తెలిపారు. 

       

తదుపరి డా.ఎన్.డెబొరా మెస్సియానా, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా కెవికె ప్రగతి గురించి వివరించారు.

      

తదుపరి శ్రీ.ఎస్.సాయి ప్రసాద్ గారు డివిజినల్ అగ్రోనమిస్ట్, కోరమాండల్ ఇంటర్నేషనల్ వారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారాకోరమాండల్ కంపెనీ వారి ఉత్పాతులు వాటి వివరాల గురించి వివిరించారు.

        

కార్యక్రమంలో చివరిగా కెవికె వారు ప్రచురించిన “సమీకృత వ్యవసాయం” మరియు “పెరటి తోటల పెంపకం” పై రెండు సమాచారా పత్రాలను విడుదల చేసారు. తదుపరి వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష కృషి చేస్తున్న 8 మండి అభ్యదయ రైతులకు సన్మానం నిర్వహించి, రైతులందరికీ ప్రసంశా పత్రాలు అందజేశారు.

 

ఈ కార్యక్రమం లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రీజనల్ బిసినెస్ హెడ్ శ్రీ చక్రవర్తి, జోనల్ మేనేజర్ శ్రీ.కెవెంకటేశ్వర్లు మరియు కెవికె శాస్త్రవేత్తలు డా. ఎం.వి.కృష్ణాజీ, డా.ఎ.శ్రీనివాస రావు, శ్రీమతి ఆర్.బిందు ప్రవీణ, శ్రీ వి.రమేష్, శ్రీ ఎ.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

                                                                                         

 

   Programme Coordinator

                                                                                               K.V.K., UNDI